తొలి షెడ్యూల్‌ పూర్తయింది - salaar first schedule wrapped
close
Published : 08/02/2021 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి షెడ్యూల్‌ పూర్తయింది

 

 

ప్రభాస్‌ కథానాయకుడుగా కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తుంది. భారీ యాక్షన్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు చిత్రీకరణ జనవరిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. గోదావరిఖని బొగ్గుగనిలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్‌ చేశారు. తాజాగా తొలి షెడ్యూల్‌ పూర్తయిందని ఈ సినిమాకు పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్‌ భువన్‌ గౌడ సామాజిక  మాధ్యమాల వేదికగా తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. కన్నడ నటుడు మధూ గురుస్వామి ప్రతినాయకుడుగా కనిపించనున్నారు. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్‌ లుక్‌ వాటిని రెట్టింపు చేస్తోంది.

 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని