‘సలార్‌’ చిత్ర యూనిట్‌ వ్యాన్‌ను ఢీకొన్న లారీ - salaar movie unit van get accident at godavarikhani
close
Updated : 03/02/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సలార్‌’ చిత్ర యూనిట్‌ వ్యాన్‌ను ఢీకొన్న లారీ

గోదావరిఖని పట్టణం: ‘సలార్‌’ చిత్ర యూనిట్‌ వెళ్తున్న వ్యానును లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద రాజీవ్‌రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది. ఘటనలో నలుగురు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. చిత్ర సిబ్బంది గోదావరిఖనిలోని తాము బస చేసే హోటల్‌కు ప్రయాణిస్తున్న క్రమంలో యూటర్న్‌ తీసుకుంటుండగా లారీ స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో వారి వాహనం దెబ్బతినడంతో పాటు వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం వారు తమ బసచేస్తున్న హోటల్‌కు వెళ్లారు. ‘సలార్‌’ చిత్రంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ రామగుండంలో ప్రారంభమైంది. ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం ‘ఆది పురుష్‌’ సెట్‌లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ముంబయిలోని ఓ ఫిల్మ్‌ స్టూడియోలో వేసిన సెట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఒక్కరోజే ప్రభాస్‌ నటిస్తున్న రెండు చిత్రాలకు సంబంధించి ప్రమాదాలు జరగడం గమనార్హం. 

ఇదీ చదవండి 
ఆండ్రియా ఆట.. సమీరా సంబరం.. పొట్టిదుస్తుల్లో దిశామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని