close
Published : 15/01/2021 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సలార్‌ షురూ.. ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు యశ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్‌-యశ్‌ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్‌’లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ‘సలార్‌’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్‌నీల్‌ ఓ సందర్భంలో వెల్లడించిన విషయం విధితమే. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌నీల్ సైతం ‘కేజీయఫ్‌-2’ విడుదలకు సన్నద్ధమవుతున్నారు.

 

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

ఇదీ చదవండి

సాబ్‌ రీఎంట్రీ.. రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా


1349968473716269057

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని