close

తాజా వార్తలు

బిగ్‌బాస్‌ నుంచి సల్మాన్‌ తప్పుకోవడం లేదు..!

ముంబయి: బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 13’. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీజన్‌ ఐదు వారాల పొడిగింపుతో ఫిబ్రవరి నెలలో ముగియనుంది. ఈ తరుణంలో అనారోగ్య సమస్యల వల్ల సల్మాన్‌ ఈ షో నుంచి తప్పుకోనున్నాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. సల్మాన్‌ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన కుటుంబసభ్యులు సైతం వెంటనే ఆయన్ని షో నుంచి తప్పుకోమని కోరినట్లు సదరు వార్తల్లో పేర్కొన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో నుంచి సల్మాన్‌ తప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై సల్మాన్‌ సన్నిహితులు ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ‘బిగ్‌బాస్‌ సీజన్‌13’ నుంచి సల్మాన్‌ వైదొలగడం లేదని వారు తెలిపారు. అంతేకాకుండా షో నుంచి తప్పుకోవాలనే ఆలోచన సల్మాన్‌కు ప్రస్తుతానికి లేదని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ సల్మాన్‌ వాటిని చాలా ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని వారు వివరించారు. 

సల్మాన్‌ గత కొన్ని సంవత్సరాల క్రితం మెదడుకు సంబంధించిన ఓ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దీనివల్ల సల్మాన్‌ కొంచెం ఒత్తిడి, కోపానికి లోనైనా సరే తీవ్రమైన నొప్పి ఆయన్ని బాధించేది. ఈ సమస్య నుంచి సల్మాన్‌ కోలుకున్నప్పటికీ ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంలో ఇంకా భయపడుతూనే ఉన్నారట.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.