సల్మాన్‌ ‘రాధే’ విడుదల తేదీ ఖరారు - salman khan confirms radhe release date
close
Published : 13/03/2021 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌ ‘రాధే’ విడుదల తేదీ ఖరారు

ఇంటర్నెట్‌డెస్క్‌: సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రాధే’. దిశా పటానీ కథానాయిక. రణదీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌, మేఘా ఆకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ ఏడాది ఈద్‌ సందర్భంగా మే 13న ‘రాధే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం గతేడాది మే 22న  ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడటంతో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. సౌత్‌ కొరియన్‌ చిత్రం ‘వెటరన్‌’కు రీమేక్‌గా ‘రాధే’ తెరకెక్కుతోంది. సాజిద్‌వాజిద్‌, దేవిశ్రీ ప్రసాద్‌, హిమేశ్‌ రేష్మియాలు సంగీతం సమకూర్చుతుండగా, రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోహాలి ఖాన్‌ ప్రొడక్షన్స్‌, సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని