సల్మాన్‌ ‘అంతిమ్‌’ 60 రోజుల్లోనే! - salman khan wraps up antim in just 60 days gears up for pathan and tiger 3 next
close
Published : 03/02/2021 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌ ‘అంతిమ్‌’ 60 రోజుల్లోనే!

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన  పాత్రలో ‘అంతిమ్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిక్కు పోలీసు అధికారిగా సల్మాన్‌ నటిస్తుండగా చిత్ర కథ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో  ఉండనుంది. జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ’కి అనుసరణీయంగా సల్మాన్‌ఖాన్‌ సొంత బ్యానర్‌ ఎస్‌కేఎఫ్‌లో నిర్మిస్తున్నారు.ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కేవలం  60 రోజుల్లోనే పూర్తి చేసేశారు. సల్మాన్‌ కేవలం 30 నుంచి 35 రోజుల మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నారు. గత పదేళ్లలో సల్మాన్‌ సినిమా ఇంత వేగంగా తెరకెక్కడం ఇదే మొదటిసారి. కొంత ప్యాచ్‌వర్క్‌ మిగిలి ఉండగా దానిని రెండురోజుల్లోనే పూర్తి చేస్తామని చిత్ర యూనిట్‌ అంటోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం జూన్‌ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. సల్మాన్‌ సోదరి అర్పితాఖాన్‌ భర్త, నటుడు ఆయుష్‌శర్మ విలన్‌గా కనిపించనున్నారు. సల్మాన్‌ ‘టైగర్‌ 3’షూటింగ్‌ దశలో ఉండగా, ప్రభదేవా దర్శకత్వం వహించిన ‘రాధే ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  మరోపక్క షారుక్‌ ‘పఠాన్‌’చిత్రంలో ‘టైగర్‌’గా 15 నిమిషాల పాటు సల్మాన్‌ మెరవనున్నారు.

ఇవీ చదవండి!

ఆ వార్తలు చూసి షాకయ్యా: డైరెక్టర్‌ శంకర్‌

‘ఆదిపురుష్‌’ ఆరంభం అంటున్న ప్రభాస్‌!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని