సెలూన్‌ యజమాని వినూత్న ఆఫర్‌ - salon owner offers 50 percent discount for customers with covid vaccination certificate at madurai
close
Updated : 21/06/2021 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెలూన్‌ యజమాని వినూత్న ఆఫర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాను కట్టడిచేయడంలో టీకా కీలకమని నిపుణులు చెబుతున్నారు. కానీ టీకాపై వస్తున్న కొన్ని వదంతుల కారణంగా కొందరు టీకా తీసుకోవడానికి భయపడుతున్నారు. దీంతో పలువురు వినూత్నరీతుల్లో టీకా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా తమిళనాడుతోని ఓ సెలూన్ యజమాని వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ ఉన్న వాళ్లు తన సెలూన్‌లో క్షవరం చేయించుకుంటే 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తానని ప్రకటించాడు.

తమిళనాడులో మధురైలోని కార్తికేయన్‌ అనే సెలూన్‌ యజమాని ఈ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. కరోనా వ్యాక్సిన్ వేయించుకొని తన వద్దకు వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్‌తో హెయిర్ కట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచేందుకు తాను ఈ ఆఫర్ ఇచ్చానని కార్తికేయన్ తెలిపాడు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలన్నా, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలన్నా.. తప్పకుండా కరోనా టీకా వేయించుకోవాలని తన దగ్గరకు వచ్చే కస్టమర్లకు చెబుతున్నాడు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని