అతడి కెప్టెన్సీలో ఆడటం గౌరవంగా భావిస్తున్నా - sam billings says hes got mind boggling when to see people worshipping ms dhoni
close
Updated : 01/06/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతడి కెప్టెన్సీలో ఆడటం గౌరవంగా భావిస్తున్నా

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిపై సామ్‌బిల్లింగ్స్‌ ప్రశంసలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి భారత్‌లో అభిమానుల ఆదరణ చూసి బుర్ర పనిచేయలేదని ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్సమన్‌ సామ్‌బిల్లింగ్స్‌ అన్నాడు. 2018, 19 సీజన్లలో చెన్నై తరఫున ఆడిన సామ్‌.. ఆ సమయంలో ధోనీని దగ్గరుండి చూశానని చెప్పాడు. మహీ సారథ్యంలో ఆడటం తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. తాజాగా హెడ్‌స్ట్రాంగ్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా ఇంగ్లిష్‌ క్రికెటర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో ధోనీ కెప్టెన్సీలో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. దాంతో అతడిని దగ్గరుండి చూసే అవకాశం దక్కింది. హోటల్లో అతడి జీవనశైలిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మ్యాచ్‌ జరిగేటప్పుడు లేదా ప్రాక్టీస్‌కు వెళ్లినప్పుడు మాత్రమే అతడిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అస్సలు వదలబుద్ధి కాదు. ఇక్కడి ప్రజలు ధోనీని ఎలా ఆరాధిస్తారో చూస్తే బుర్ర పనిచేయదు’ అని సామ్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ఇంగ్లాండ్‌లో ఎవరినైనా క్రికెట్‌ అంటే ఇష్టమా? అని అడిగితే వాళ్లకి ఇష్టమనో.. ఇష్టం లేదనో చెప్పొచ్చని, అదే భారత్‌లో అలాంటి పరిస్థితి ఉండదని సామ్‌ పేర్కొన్నాడు. ఇక్కడ ఎవర్ని అడిగినా క్రికెట్‌ అంటే పడి చచ్చిపోతారని పేర్కొన్నాడు.

కాగా, సామ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2018లో పది మ్యాచ్‌లే ఆడి 108 పరుగులు చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం బాదాడు. ఇక 2019లో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడినా తర్వాత అవకాశం దక్కలేదు. ఈ క్రమంలోనే 2020లో అసలు టోర్నీలోనే లేడు. అయితే, ఈసారి వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.2కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మరి సెప్టెంబర్‌లో జరిగే రెండో భాగంలో అయినా అతడు బరిలోకి దిగుతాడో లేదో వేచిచూడాలి. మరోవైపు ఇంగ్లాండ్‌ మాత్రం ఐపీఎల్‌ తిరిగి ప్రారంభమైతే తమ ఆటగాళ్లను ఆడించబోమని స్పష్టం చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని