అక్కా చెల్లెళ్లుగా సమంత.. రష్మిక? - samantha and rashmika will play as sisters
close
Published : 09/08/2020 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కా చెల్లెళ్లుగా సమంత.. రష్మిక?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం సాధారణ విషయమే. కొన్ని సినిమాల్లో హీరోయిన్లు అక్కా చెల్లెల్లుగా నటించినా.. ఒకరు స్టార్‌ హీరోయిన్‌ అయితే మరొకరి ఓ మోస్తరు పేరున్న హీరోయిన్‌ అయి ఉంటుంది. కానీ ఓ యువ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో ఇద్దరు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారట. 

వివాహం అయినా తనదైన శైలిలో సినిమాలను ఎంచుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత అక్కినేని.. తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే వరుస విజయాలతో టాప్‌ హీరోయిన్‌ అనిపించుకున్న రష్మిక మందన కలిసి ఓ సినిమాలో అక్కాచెల్లెళ్లుగా నటించబోతున్నట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఓ యువ దర్శకుడు వీరిద్దరి కోసం మహిళా ప్రాధాన్యమున్న ఓ కథను సిద్ధం చేశాడట. ఆ కథను విన్న సమంత, రష్మిక అక్కాచెల్లెళ్లుగా నటించడానికి ఒప్పుకున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరి సినిమా పట్టాలెక్కితే ఈ క్రేజీ కాంబినేషన్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా సమంత ఇంట్లోనే ఉంటూ టెర్రస్‌ గార్డెనింగ్‌ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు హిందీ వెబ్‌సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్-2లో నటించింది. మరోవైపు రష్మిక.. అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ, కన్నడ భాషల్లోనూ పలు సినిమాలు చేస్తోంది. లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్స్‌ అన్ని వాయిదా పడటంతో  ప్రస్తుతం రష్మిక కూడా ఇంట్లోనే ఉంటుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని