ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సమంత - samantha recent insta chat with fans
close
Published : 27/01/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సమంత

చైతో జిమ్‌.. అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టిన నటి

హైదరాబాద్‌: ఏ తరహా సినిమా అయినా సరే పాత్రలోకి ఒదిగిపోయి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు అగ్రకథానాయిక సమంత అక్కినేని. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ తెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘కాతువక్కుల రెందు కాదల్‌’ షూట్‌ కోసం చెన్నైలో ఉంటోన్న సామ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా కొంతసమయంపాటు నెటిజన్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చాలా కాలం తర్వాత చెన్నైకు రావడం ఎలా ఉంది?

సామ్‌: చెన్నై నగరాన్ని ఎంతగా మిస్‌ అయ్యానో ఇన్నాళ్లూ అర్థం కాలేదు. చాలా కాలం తర్వాత హోమ్‌ టౌన్‌కు రాగానే సంతోషంగా అనిపించింది. నా తల్లిదండ్రులు, స్నేహితులను కలవడం ఆనందంగా ఉంది. చెన్నైలో షూట్‌.. తమిళం మాట్లాడడం బాగుంది.

మీరు ఇప్పటివరకూ పోషించిన పాత్రల్లో మీకు బాగా నచ్చినవి ఏమిటి?

సామ్‌: ‘ఓ బేబీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’.. ఆ రోల్స్‌ నాకెంతో నచ్చాయి.

మీకు బాగా నచ్చిన పుస్తకాలు?

సామ్‌: నచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో ‘Asterix And Obelix’ చిన్నప్పుడు నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే శాంతారామ్‌, మహాభారతం.

మీ 20 ఏళ్ల వయసుకు మీరు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు?

సామ్‌: మీరు అడిగిన ప్రశ్న ఎంతో బాగుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఎన్నో తప్పులు చేశాను. కాబట్టి.. 20 ఏళ్ల వయసుకు సంబంధించి నాకు నేను చెప్పుకోవాలంటే.. ‘గ్రో అప్‌’ అని చెప్పుకుంటా.

మీ గ్యాలరీలోని ఏడో ఫొటో/వీడియో షేర్‌ చేయండి?

సామ్‌: నాకు కూడా తెలీదు అప్పుడు నేను ఎందుకు అంత కోపంగా కనిపిస్తున్నానో.

2020లో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ జ్ఞాపకం?

సామ్‌: రానా-మిహీకా వివాహం

చై ఎందుకని ఎప్పుడూ బయట కనిపించడు. మేము ఆయన్ని ఆఫ్‌స్ర్కీన్‌లో ఎక్కువగా చూడాలనుకుంటున్నాం..!

సామ్‌: ఈ ప్రశ్నను చైనే అడుగుదాం.

సోషల్‌మీడియా ట్రోల్స్‌ని మీరు ఎలా స్వీకరిస్తారు?

సామ్‌: ప్రస్తుతం ట్రోల్స్‌ నన్ను ఏవిధంగానూ ఇబ్బంది పెట్టడం లేదు. కొంతకాలం క్రితం నెగెటివ్‌ కామెంట్ల వల్ల నేను నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు నెట్టింట్లో నా గురించి వస్తోన్న విమర్శలు చూసినప్పుడు నవ్వొస్తుంది.

మీ అభిమాన టీచర్‌?

మీ పార్ట్నర్స్‌ ఇన్‌ క్రైమ్‌?

మీరింత ఫిట్‌నెస్‌ లవర్‌గా మారడానికి కారణమేమిటి?

సామ్‌: హాయ్‌.. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యాన్ని చెబుతున్నాను. చైని కలవడం కోసమే నేను జిమ్‌లో జాయిన్‌ అయ్యాను. అలా నేను మొదటిసారి జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాను.

ఒత్తిడి, మానసిక కుంగుబాటును జయించడానికి ఒక సలహా ఇవ్వగలరు?

సామ్‌: నేను వైద్యురాలిని కాదు. ధ్యానం, శ్వాస మీద పూర్తి ధ్యాస.. ఈ రెండు ఒత్తిడిని జయించడానికి నాకెంతగానో ఉపయోగపడ్డాయి. మీ శ్వాసపై మీకు నియంత్రణ ఉంటే జీవితంపై కూడా సరైన కంట్రోల్‌ని ఏర్పర్చుకోగలం.

మీ 2021 తీర్మానాలు ఏమిటి?

సామ్‌: ఎప్పటిలానే నన్ను నేను సంతోషంగా ఉంచుకునేందుకు రోజూ తప్పకుండా ధ్యానం, యోగా చేయాలనుకుంటున్నా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని