close
Published : 25/02/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం  ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో సమంత నటిస్తోంది. ఈ చిత్రానికి భారీ సెట్స్ చాలా అవసరం. అందుకు తగ్గట్లుగానే గుణశేఖర్‌ ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. తాజాగా సినిమా షూటింగ్‌ని మార్చి 20న ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లు ఆ మధ్య విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో వెల్లడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సమంతకు ఇది వైవిధ్యమైన పాత్రగా చెప్పుకోవచ్చు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని