ఈ కష్టకాలంలో ఒకటిగా నిలుద్దాం: సమంత - samantha urge to donate
close
Published : 01/05/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ కష్టకాలంలో ఒకటిగా నిలుద్దాం: సమంత

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఈ కష్టకాలంలో ఒకటిగా నిలుద్దాం.. కొవిడ్‌ బాధితులకు సాయం చేద్దాం’ అని కోరారు ప్రముఖ నాయిక సమంత. కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు సమయానికి అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా జరగకుండా ఉండేందుకు మనం వంతు కృషి చేద్దామన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారామె.

‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ఒకటిగా నిలవాల్సిన అవసరం ఉంది. అవసరమైన వారికి ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు, మందులు అందిచేందుకు ప్రత్యూష సపోర్ట్‌, డొనేట్‌ కార్ట్ ఆర్గనైజన్లు విరాళాలు సేకరిస్తున్నాయి. ఈ మంచి పనికి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ గారు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా తోచినంత సాయం చేస్తారని కోరుతున్నాను’ అంటూ సంబంధిత వెబ్‌సైట్‌ వివరాలు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో జతచేశారు సమంత. గతంలో ప్రత్యూష సపోర్ట్‌ ఆర్గనైజేషన్‌ వేదికగా సమంత పలు సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని