Samantha: ఆ బాలీవుడ్ హీరోతో న‌టించాల‌నుంది - samantha wants to romance with bollywood hero
close
Updated : 24/05/2021 08:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: ఆ బాలీవుడ్ హీరోతో న‌టించాల‌నుంది

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘ది ఫ్యామిలీ మెన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానుంది అక్కినేని స‌మంత‌. ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ ఆంగ్ల మీడియా ఆమెతో ముచ్చ‌టించింది. ఏ బాలీవుడ్ హీరో స‌ర‌స‌న న‌టించాల‌నుకుంటున్నారు? అనే ప్ర‌శ్న ఎదుర‌వ‌గా వెంట‌నే ర‌ణ్‌బీర్ క‌పూర్ అని స‌మాధానం ఇచ్చింది సామ్‌. ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లోని మ‌నోజ్ భాజ్‌పాయ్ పాత్ర ద‌క్షిణాదిలో ఏ న‌టుడికి స‌రిపోతుంది? అని అడిగితే అక్కినేని నాగార్జున అని చెప్పుకొచ్చింది. మ‌నోజ్ భాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ్, డీకే ద్వ‌యం ఈ సిరీస్‌ని తెర‌కెక్కిస్తున్నారు. జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా సామ్ న‌ట‌న‌కు అంతా ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం ‘శాకుంత‌లం’ చిత్రంతో బిజీగా ఉంది స‌మంత‌. గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ  బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని