మామ సరైన న్యాయం చేశారు: సామ్‌ - samantha wilddog review
close
Updated : 02/04/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మామ సరైన న్యాయం చేశారు: సామ్‌

సమంత ‘వైల్డ్‌డాగ్‌’ రివ్యూ

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు నాగార్జునపై ఆయన కోడలు, నటి సమంత ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్‌ వర్మ పాత్రకు నాగార్జున తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని ఆమె అన్నారు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘వైల్డ్‌డాగ్’ చిత్రాన్ని వీక్షించిన సామ్‌ చిత్రబృందాన్ని అభినందించారు. అలాగే సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘ఇప్పుడే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రాన్ని చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎంతోకాలం నుంచి యాక్షన్‌ జోనర్‌ సినిమాలు మిస్‌ అవుతున్నాను. హాలీవుడ్‌ స్టైల్‌, పవర్‌ప్యాక్డ్ యాక్షన్‌, ఎమోషనల్‌.. ఇలా ఎన్నో అంశాలు ఈ సినిమాలో చూశాను. మీరూ చూడండి. నాగార్జున కాకుండా వేరే ఎవరూ ఈ పాత్రను చేయలేరు’’ అని సామ్‌ తన రివ్యూలో తెలియజేశారు.

హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు దాడులను ఆధారంగా చేసుకుని థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. అహిషోర్‌ సాల్మాన్‌ దర్శకుడు. ఇందులో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మ పాత్ర పోషించారు. దియా మీర్జా, సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని