Samuthirakani: అభిరామ్‌-తేజ చిత్రంలో? - samuthirakani get lead role in teja movie
close
Updated : 27/07/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samuthirakani: అభిరామ్‌-తేజ చిత్రంలో?

హైదరాబాద్‌: దగ్గుబాటి అభిరామ్‌ను కథానాయకుడిగా  పరిచయం చేస్తూ.. దర్శకుడు తేజ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌     నిర్మిస్తున్నారు. ఆర్‌.పి.పట్నాయక్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఇతర ప్రధాన తారగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది.

ఇప్పుడిందులో ఓ ప్రధాన పాత్ర కోసం సముద్రఖనిని   తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ విషయమై దర్శక నిర్మాతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తేజ శైలిలో సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ‘అహింస’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని