పవన్‌-రానా మూవీలో ప్రముఖ విలన్‌ - samuthirakani to essay an important role in pawan kalyan and rana daggubati remake of ayyappanum koshiyum
close
Published : 18/01/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌-రానా మూవీలో ప్రముఖ విలన్‌

త్రివిక్రమ్‌ ఆఫర్‌

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ - రానా కాంబోలో త్వరలో ఓ సూపర్‌హిట్‌ రీమేక్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రానుంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో తనకి ఆఫర్‌ లభించినట్లు ప్రముఖ నటుడు సముద్రఖని తెలియజేశారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘అల.. వైకుంఠపురములో..’, ‘క్రాక్‌’ విజయాల తర్వాత తెలుగులో నాకు మంచి అవకాశాలు లభించాయి. రామ్‌చరణ్‌-తారక్‌ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తోపాటు నితిన్‌, నాని సినిమాల్లో సైతం నేను కీలకపాత్ర పోషించనున్నాను. అంతేకాకుండా పవన్‌-రానా కలిసి నటిస్తున్న సినిమాలో ఓ పాత్ర కోసం త్రివిక్రమ్‌ నన్ను సంప్రదించారు. వాళ్లతో కలిసి పనిచేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులను అలరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’ అని సముద్రఖని తెలియజేశారు.

ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలో జరుపుకోనుంది. ఇందులో కథానాయికలుగా సాయిపల్లవి, ఐశ్వర్యరాజేష్‌లు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి

పవన్‌-రానా మూవీ: క్రేజీ అప్‌డేట్‌ ఇదే!
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని