బావిలో దూకడానికి వెళుతున్నా..  - sandeep aur pinky faraar trailer 2
close
Published : 09/03/2021 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బావిలో దూకడానికి వెళుతున్నా.. 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడి పేరు పింకీ.. ఆమె పేరు సందీప్‌. వాళ్ల పేర్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి..? వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటి.? అసలు వాళ్లిద్దరూ కలిసి భారత్‌-పాకిస్థాన్‌ సరహద్దు దాటాలని నిర్ణయించుకోవడానికి దారి తీసిన కారణాలేంటి..? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’. అర్జున్‌ కపూర్‌, పరిణీతి చోప్రా జంటగా నటించారు. దివాకర్‌ బెనర్జీ దర్శకత్వంలో తెరకెక్కించడంతో పాటు స్వయంగా నిర్మించారు. అను మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘‘రైల్వే స్టేషన్‌లో కూర్చున్న హీరోను.. ‘ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతుంది హీరోయిన్‌. ‘బావిలో దూకడానికి వెళుతున్నా.. నువ్వు కూడా వస్తావా..?’ అంటూ హీరో బదులివ్వడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. నువ్వు ఎవరి జీవితంలోనైనా సమస్యగా మారితే అక్కడి నుంచి బయటికి రావాలంటూ హీరో-హీరోయిన్‌ మధ్య సాగే సంభాషణతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. మీరూ చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని