కరోనాపై సంగారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన - sangareddy police spreading awareness with heavy masks infront of police vehcles
close
Published : 21/04/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై సంగారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన

సంగారెడ్డి: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు వాహనాలకు ముందువైపు భారీ మాస్కులు కట్టి వీధుల్లో తిప్పుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు.

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కొవిడ్‌ కేసులు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 6,542 మంది వైరస్‌ బారిన పడ్డారు. 20 మంది మృతిచెందారు. కాగా మొత్తం మృతుల సంఖ్య 1,876కు చేరింది.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని