సంజయ్‌ దత్‌తో అలియా భట్ ప్రయాణం ఎందాక? - sanjay dutt new movie ‘sadak-2’ trailer
close
Published : 13/08/2020 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంజయ్‌ దత్‌తో అలియా భట్ ప్రయాణం ఎందాక?

ఆసక్తికరంగా ‘సడక్‌-2’ ట్రైలర్‌

ముంబయి: బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ మరో సినిమా ‘సడక్‌-2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో బాలీవుడ్ భామ అలియా భట్‌కు డ్రైవర్‌ పాత్రలో సంజు అలరించనున్నాడు. ఇవాళ ‘సడక్‌-2’ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. 1991లో వచ్చిన ‘సడక్’లోని ఓ సన్నివేశంతో ట్రైలర్‌ మొదలవుతుంది. అలియాకు జోడీగా ఆదిత్య రాయ్ కపూర్‌ నటిస్తున్నారు. మరి ఈ ముగ్గురి ప్రయాణం ఎందాక సాగింది? ఎలాంటి పరిణామాలను వారు ఎదుర్కొన్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  ఆగస్టు 28న డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌లో సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. 

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో హిందీ సినీ పరిశ్రమలో బంధుప్రీతి (నెపోటిజం) మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ప్రభావం ‘సడక్‌-2’పై కూడా ఉండబోతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ‘సడక్-2’ దర్శకుడు మహేష్‌ భట్ సుశాంత్‌ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. దీంతో ‘సడక్‌-2’కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘గులాబో సితాబో’, ‘శకుంతలా దేవి’, ‘గుంజన్‌ సక్సేనా‌’ వంటి సినిమాలను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో సినీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని