నందినీరెడ్డి దర్శకత్వంలో ‘ఏక్ మినీ కథ’ హీరో? - santosh shobhan under the direction of nandini reddy
close
Published : 02/06/2021 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నందినీరెడ్డి దర్శకత్వంలో ‘ఏక్ మినీ కథ’ హీరో?

ఇంటర్నెట్‌ డెస్క్: ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు నందినీరెడ్డి. ఈ మధ్యే ఓటీటీలో విడుదలైన ‘ఏక్‌ మినీ కథ’ హీరో సంతోష్‌ శోభన్‌తో ఆమె ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ‘ఏక్‌ మినీ కథ’లో సంతోష్‌ నటన చూసి ఆమె ముగ్ధురాలయ్యిందట. ఇప్పటికే అతనికి కథను కూడా వినిపించిందట. సంతోష్‌ కూడా కథ పట్ల సానుకూలతను వ్యక్తం చేశాడని చెప్పుకుంటున్నారు. కొవిడ్ -19 పరిస్థితి మెరుగైన వెంటనే చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందట. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్ నిర్మించనుందట. నందిని ప్రస్తుతం ఆహా వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉంది. ఈ సంవత్సరం చివరలో గీతా ఆర్ట్స్ కోసం ఓ సినిమాకి  దర్శకత్వం వహించడానికి ఆమె ఇప్పటికే అంగీకరించింది. మరోవైపు మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సీరీస్‌లో సంతోష్ శోభన్‌ నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని