విజయ్‌కు జోడీగా మరో బీటౌన్‌ బ్యూటీ - sara ali khan and vijay deverakonda teaming up for a south film
close
Published : 11/03/2021 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌కు జోడీగా మరో బీటౌన్‌ బ్యూటీ

ఫొటో వైరల్‌..

హైదరాబాద్‌: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండకు క్రేజ్‌ మామూలుగా లేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌ హీరోయిన్స్‌ సైతం ఆయనతో కలిసి నటించేందుకు ఎంతో ఆసక్తికనబరుస్తున్నారు. ‘లైగర్‌’ కోసం ఇప్పటికే బాలీవుడ్‌ భామ అనన్యాపాండేతో ఆడిపాడుతున్న విజయ్‌.. త్వరలోనే మరో బీటౌన్‌ బ్యూటీతో స్క్రీన్‌పై రొమాన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా కథానాయిక అంటే సారా అలీఖాన్‌.

‘లైగర్‌’ షూట్‌లో భాగంగా విజయ్‌దేవరకొండ ఎక్కువ సమయం ముంబయిలోనే గడుపుతున్నారు. షూట్‌ కోసం గత కొన్నిరోజుల క్రితం ముంబయికి వెళ్లిన విజయ్‌.. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నటి సారాఅలీఖాన్‌తో కలిసి ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అప్పట్లో ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే విజయ్‌-సారా కలిసి ఓ దక్షిణాది చిత్రంలో నటించే అవకాశముందంటూ తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత వీరిద్దరితో కలిసి సినిమా రూపొందించేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని