విక్కీ ‘అశ్వత్థామ’ చిత్రంలో సారా అలీఖాన్‌? - sara ali khan confirmed to star opposite vicky kaushal
close
Updated : 26/03/2021 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విక్కీ ‘అశ్వత్థామ’ చిత్రంలో సారా అలీఖాన్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: విక్కీ కౌశల్‌ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘ది ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ’. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా సారా అలీఖాన్‌ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఆమె కూడా చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే టాక్‌ వినిపిస్తోంది. సినిమాలోని పాత్ర కోసం ఆమెకు శిక్షణ కూడా ఇవ్వనున్నారట. ఇందులో ఆమె చేయబోయే కొన్ని పోరాట సన్నివేశాలు కథలో కీలకం కానున్నాయట. ఆర్‌ఎస్‌వీపీ సమర్పణలో రూపొందుతున్న చిత్రానికి రోన్నీ స్ర్కూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక విక్కీ కౌశల్‌ సైతం సినిమా కోసం శారీరక శిక్షణతో పాటు గుర్రపుస్వారీ, విలువిద్య వంటి అంశాలపై దృష్టిపెట్టారు. వాటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. సారా అలీఖాన్‌ ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. కానీ ఈ చిత్రంలోని పాత్ర మాత్రం ఆమెకు కొత్తగా ఉండనుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. సినిమాకి మితేష్ మిర్‌చందాని ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్నారు. సారా ప్రస్తుతం ‘అత్రాంగి రే’లో సాగరిక శర్మ పాత్రలో నటిస్తోంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌ కూడా నటిస్తున్నారు. గత ఏడాది సారా అలీఖాన్‌ - వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘కూలీ నెం.1’ చిత్రంలో నటించింది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని