sara ali khan: సాహసాలకు సర్వం సిద్ధం - sara ali khan take training for horse riding
close
Published : 22/05/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

sara ali khan: సాహసాలకు సర్వం సిద్ధం

ముంబయి: ఇప్పటి వరకు ప్రేమ కథల్లో అందాల నాయికగా అల్లరి చేసిన సారా అలీఖాన్‌.. ఇప్పుడు తొలిసారి ఓ సినిమా కోసం సాహసాలు చేయనుంది. స్టార్‌ హీరోలకు దీటుగా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. సారా ప్రస్తుతం విక్కీ కౌశల్‌కి జోడీగా ‘ది  ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.

మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రని ఆధారంగా చేసుకొని ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇందులో సారా పాత్రకీ భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. అందుకే ఈ పాత్ర కోసం విక్కీతో కలిసి కొన్ని నెలలుగా తెగ కసరత్తులు చేస్తోందట. గుర్రపు స్వారీతో పాటు విలువిద్య నేర్చుకుంటోందట. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు నుంచి ప్రారంభం కానున్నట్లు  తెలుస్తోంది. ఇందుకోసం ఐదు నెలల నిడివి గల భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. భారత్‌తో పాటు అమెరికా, ఐస్‌లాండ్‌లలో షూట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఆదిత్య ధర్‌  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని