శేఖర్‌ కమ్ములను కలిసిన ‘సారంగ దరియా’ కోమలి  - saranga dariya komali met director sekhar kammula
close
Published : 17/03/2021 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శేఖర్‌ కమ్ములను కలిసిన ‘సారంగ దరియా’ కోమలి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సారంగ దరియా’ పాటపై కొంతకాలంగా సాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ముగింపు దొరికింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘సారంగ దరియా’ పాటపై నెలకొన్న వివాదం అందిరికీ తెలిసిందే. కాగా.. ఈ పాట తనదేనంటూ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసిన జానపద గాయని కోమలి డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములను బుధవారం కలిసింది. ఈ సందర్భంగా కోమలి మాట్లాడింది.. ‘‘నా పాట నేనే పాడాలని ఆశించాను. నన్ను ‘రేలారే రేలా’కు తీసుకొచ్చిన మా గురువు సురేశ్‌ సహాయంతో డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములగారిని కలిశాను. తన తర్వాతి సినిమాలో నాకు పాడే అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. అవసరమైతే ఆడియో ఫంక్షన్లలో కూడా అచ్చమైన పల్లెగొంతును వినిపిస్తామని అన్నారు. ఈ ‘సారంగదరియా’ పాటపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని ఆమె చెప్పింది. అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. కమ్యునికేషన్‌ లేకపోవడం వల్లే కోమలి తనను ఇంతకాలం కలవలేకపోయిందన్నారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోమలికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని