మహేశ్‌ మూవీ.. డైరెక్టర్‌ కష్టానికి నిదర్శనమిది - sarkaru vaari paata shooting pic goes viral in internet
close
Published : 04/02/2021 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ మూవీ.. డైరెక్టర్‌ కష్టానికి నిదర్శనమిది

నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో

హైదరాబాద్‌: ఓ సినిమా జయాపజయాలు దర్శకత్వంపై ఆధారపడి ఉంటాయి. అందుకే దర్శకుడిని కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌గా అభివర్ణిస్తుంటారు. తాము అనుకున్న విధంగా సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశంలో దర్శకులు ఎన్నో ఇబ్బందులను, మరెన్నో ఒడుదొడుకులను చిరునవ్వుతో స్వీకరిస్తుంటారు. ఎండా, వానా ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్లు పడే కష్టం అంతాఇంతా కాదు. అలా.. దర్శకులు పడే కష్టానికి సూపర్‌స్టార్‌ మూవీ షూటింగ్‌ ఫొటోనే నిదర్శనం అనుకుంటున్నారు నెటిజన్లు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారువారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేశ్‌ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ దుబాయ్‌లో ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఇక్కడ మహేశ్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో మహేశ్‌బాబు తన అసిస్టెంట్స్‌తో ఉండగా.. ఓ వ్యక్తి మండుటెండలో నేలపై కూర్చొని ఏదో రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆ వ్యక్తి దర్శకుడు పరశురామేనని అందరూ చెప్పుకుంటున్నారు. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. వృత్తిపట్ల పరశురామ్‌కు ఉన్న నిబద్ధతను చూసి అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసు ప్రసాద్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని