‘శశి’ అందరినీ అలరిస్తుంది: సురభి - sashi movie actress surbhi pressmeet
close
Updated : 13/03/2021 21:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘శశి’ అందరినీ అలరిస్తుంది: సురభి

హైదరాబాద్‌: ఆది, సురభి కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘శశి’. శ్రీనివాస్‌ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కింది. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయిక సురభి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇదో రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. తొలుత కథ వినగానే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించి ఒప్పుకొన్నా. ఈ చిత్రంలో రాజీవ్ క‌న‌కాల కూతురిగా నటిస్తున్నా. ఆయనకు నేను గారాలపట్టిని. నిజ జీవితంలో తల్లితండ్రులకు నేనొక్క అమ్మాయినే. అందుకే నా పాత్ర‌తో సరిపోల్చుకొని కనెక్టు అయ్యాను. చిత్రంలో నాది పొగరున్న అమ్మాయి పాత్ర. కాలేజ్‌లో మా గ్యాంగ్‌తో కలిసి ర్యాగింగ్ చేసే కొన్ని స‌న్నివేశాలు చాలా సరదాగా అనిపిస్తాయి. ఇందులో నా పాత్రలో మరో కోణం కూడా ఉంటుంది. అదేంట‌న్నది మీరు తెరపైనే చూడాలి.

ఇందులోని పతాక సన్నివేశాల్లో చాలా ఎమోషన్‌ ఉంటుంది. ఆదితో కలిసి తొలిసారిగా నటిస్తున్నా. ఆయన పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. ఎలాంటి భేషజాలు లేవు. మంచి డ్యాన్సర్‌ కూడా. సినిమాలో ఆదికి మ్యూజిక‌ల్ బ్యాండ్ ఉంటుంది. అతను గిటార్ ప్లే చేస్తుంటాడు. ఒక మంచి వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకునే పాత్ర నాది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆది నాకెంతో సాయం చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రెడిట్‌ అంతా సంగీత దర్శకుడు అరుణ్‌కే దక్కుతుంది. ముఖ్యంగా ‘‘ఒకే ఒక లోకం నువ్వే’’ పాటకి మంచి స్పందన వ‌స్తోంది. చిత్రంలో ఇతర నటులైన వెన్నెల కిశోర్‌, వైవా హర్ష పాత్రలు నవ్విస్తాయి. మా నిర్మాతలు చాలా సపోర్ట్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ‌గారు ట్రైల‌ర్ చూసి చాలా బాగుందన్నారు. భవిష్యత్‌లో యాక్టింగ్‌ అవకాశం ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నా. గ్లామర్‌ పాత్రలు చేయడానికీ సిద్ధమే. చిత్రసీమలోని ప్రముఖులందరితో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఇప్ప‌టి వరకు 13 చిత్రాలు చేశాను. త‌మిళంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించా. కన్న‌డ‌లోనూ ఓ చిత్రం చేస్తున్నా. తెలుగులో రెండు కథలు విన్నాను. వాటి గురించి త్వ‌ర‌లోనే మీకు చెప్తా’’ అని సురభి చెప్పుకొచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని