పవర్‌స్టార్ రిలీజ్‌ చేసిన ‘శశి’ ట్రైలర్‌! - sasi movie trailer
close
Published : 11/03/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవర్‌స్టార్ రిలీజ్‌ చేసిన ‘శశి’ ట్రైలర్‌!

]

హైదరాబాద్‌: ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన ‘శశి’ ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తాజాగా విడుదల చేశారు. ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి’ అంటూ ఆది చెప్తున్న డైలాగ్స్‌ స్ఫూర్తివంతంగా ఉన్నాయి. అలాగే ‘ప్రేమంటే లేనిచోట వెతుక్కోవడం కాదు, ఉన్నచోట నిలబెట్టుకోవడం’అని హీరోయిన్‌ చెప్తున్న డైలాగ్‌తో ఇద్దరి మధ్య ఎడబాటు కనిపిస్తోంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ఎంతటి సూపర్‌హిట్‌ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. శ్రీహనుమాన్‌ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించగా శ్రీనివాస్‌ నాయుడు నడికంట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అరుణ్‌ చిలవేరు మ్యూజిక్‌ అందించారు. మార్చి 19న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. అప్పటిదాకా ఈ ట్రైలర్‌ను చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని