మీడియాపై ఈసీ పిటిషన్‌: కొట్టివేసిన సుప్రీం - sc dismisses ec petition over media
close
Published : 06/05/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీడియాపై ఈసీ పిటిషన్‌: కొట్టివేసిన సుప్రీం

భావ ప్రకటనా స్వేచ్ఛను నిలువరించలేం

దిల్లీ: న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను నివేదించకుండా మీడియాను నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తిని భారత అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం, ఈసీ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాకుండా మీడియాపై ఫిర్యాదు చేసి వాటికి సంకెళ్లు వేయాలని రాజ్యాంగబద్ధ సంస్థలు కోరడం కంటే.. మరింత ఉన్నతంగా వ్యవహరించవచ్చని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ వ్యాఖ్యలు కొంత కఠినంగానే ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే, తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశమున్న అంశాల్లో న్యాయస్థానాలు కొంత నిగ్రహం పాటిస్తూ సంయమనంతో వ్యవహరించాలని సూచించింది.

కొవిడ్‌-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చేసిన మౌఖిక వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టుల్లో జరిగే విచారణను నివేదించకుడా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. న్యాయస్థానాల్లో జరిగే విషయాలు తెలుసుకోవడం రాజ్యంగ స్వేచ్ఛకు రక్షణ కవచమని అభిప్రాయపడింది. ఇదే సమయంలో పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగ కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేసింది. అందుకే న్యాయస్థానాల్లో జరిగే అంశాలను బాహ్య ప్రపంచానికి తెలిపే స్వేచ్ఛ మీడియాకు ఉందని వ్యాఖ్యానించింది. ఇలా చేయకుండా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని