సుప్రీంకోర్టులో 50% సిబ్బందికి కరోనా! - sc judges to work from home amid hit its staff
close
Published : 12/04/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుప్రీంకోర్టులో 50% సిబ్బందికి కరోనా!

ఇంటివద్ద నుంచే కేసులు విచారించనున్న జడ్జీలు

దిల్లీ: భారత్‌లో మరోసారి పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా తీవ్ర ప్రభావం చూపించింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దాదాపు 50శాతం మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడినట్లు ఆంగ్ల వార్తాసంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. శనివారం ఒక్కరోజే 44 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు మళ్లీ వర్చువల్‌ విధానంలో కేసుల విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వర్గాలు వెల్లడించాయి. 

అనేక మంది సిబ్బంది, లా క్లర్కులకు కరోనా సోకడంతో న్యాయమూర్తులు కేసుల విచారణ ఇంటి వద్ద నుంచే వర్చువల్‌గా చేపట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కరోనా కేసుల నేపథ్యంలో కోర్టు హాళ్లు, పరిసరాలను శానిటైజ్‌ చేస్తున్నట్లు తెలిపాయి. 

మరోవైపు నేడు పలు బెంచ్‌లు షెడ్యూల్‌ సమయం కంటే గంట ఆలస్యంగా మొదలవనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే బెంచీలు ఉదయం 11.30 గంటలకు, 11 గంటలకు మొదలయ్యే బెంచీలు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ప్రారంభించనున్నాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రీ ముందు అత్యవసర కేసుల ప్రస్తావన కూడా ఆన్‌లైన్‌లో చేయాలని వెల్లడించారు.   

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్షన్నరకు పైనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రాత్రికర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని