Pegasus spyware: ఆ వార్తా కథనాలు నిజమైతే ‘పెగాసస్‌’ తీవ్రమైందే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు - sc posts pleas seeking probe into alleged pegasus snooping matter for hearing on aug 10
close
Published : 05/08/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pegasus spyware: ఆ వార్తా కథనాలు నిజమైతే ‘పెగాసస్‌’ తీవ్రమైందే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

దిల్లీ: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్‌ అంశంపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ‘వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైనవే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైంది’ అంటూ విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెగాసస్‌ లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికిపైగా భారతీయులు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు ఆ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు ఫోన్లూ హ్యాకింగ్‌ జాబితాలో కనిపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పెగాసస్‌పై పార్లమెంట్ వేదికగా విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. దీంతో ఉభయ సభలూ వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఇందులో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ల ట్యాపింగ్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడతారని తెలుసు. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది. ఇది రాజ్యాంగబద్ధత, నేరతత్వానికి సంబంధించింది’’ అని పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని