Corona: అనాథలైన పిల్లలను గుర్తించండి - sc takes note of children orphaned due to covid directs states to provide immediate relief
close
Published : 28/05/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: అనాథలైన పిల్లలను గుర్తించండి

జిల్లా యంత్రాంగాలకు సుప్రీం ఆదేశాలు

దిల్లీ: రెండో దశలో కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. ముఖ్యంగా అనేక మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. అలాంటి వారిని గుర్తించి తక్షణ సాయం అందించాలని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఆదేశించింది. 

కరోనాతో అనాథలైన చిన్నారులకు రక్షణ కల్పించాలని కోరుతూ అమికస్‌ క్యూరీ గౌరవ్‌ అగర్వాల్‌ సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు, జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌లతో కూడిన వేకేషన్‌ బెంచ్‌ నేడు విచారణ చేపట్టింది. అనాథలైన చిన్నారులను గుర్తించి శనివారం లోగా వారి వివరాలను NCPCR వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా యంత్రాంగాలను న్యాయస్థానం ఆదేశించింది. అలాంటి పిల్లలకు తక్షణ సాయం అందించాలని సూచించింది. 

గడిచిన 2 నెలల్లో దేశవ్యాప్తంగా కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 577 మంది చిన్నారులను ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకుంటామని ఇటీవల సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కన్పిస్తున్నాయి. అయితే, ఇలాంటి దత్తతలు వేధింపులు లేదా పిల్లల అక్రమ రవాణాకు దారితీయొచ్చని పలు ఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అనాథ చిన్నారులను, ఏ ఆసరా లేని వృద్ధులను ఇతర బాధిత వర్గాలను ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. వారికి అవసరమైన వైద్యం, భద్రత కల్పించాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ సాయం ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలని సూచించింది. పోలీస్‌ స్టేషన్లలో మహిళలకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని