నోటి కణాలపైనా కరోనా వైరస్‌ ప్రభావం! - scientists find evidence that novel coronavirus infects the mouth cells
close
Published : 27/03/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నోటి కణాలపైనా కరోనా వైరస్‌ ప్రభావం!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి శరీరంలోని శ్వాసకోస వ్యవస్థ, రక్తనాళాలు, మూత్రపిండాలతో పాటు ఇతర అవయవాలపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిసిందే. తాజాగా నోటి కణాలపైనా కరోనా వైరస్‌ దాడి చేస్తుందని రుజువైంది. నోటిలో కరోనా వైరస్‌ ప్రభావంపై అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

కొవిడ్‌ రోగుల్లో వాసన, రుచిని కోల్పోవడం, ఒక్కోసారి పొక్కులు రావడం వంటి లక్షణాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా పాజిటివ్‌ వచ్చిన రోగుల లాలాజలంలో అధిక మొత్తంలో కరోనాకు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 ఉంటుందని తెలిసింది. దీంతో ఇతర అవయవాలకు వైరస్‌ను వ్యాపించడంలో నోటిలోని లాలాజలం కూడా కారణమవుతున్నట్లు నిపుణులు అనుమానించారు. అంతేకాకుండా నోటి కణాలపై ఈ వైరస్‌ దాడి చేస్తుందని గమనించారు. దీనిని నిర్ధారించుకునేందుకు అమెరికాలోని జాతీయ ఆరోగ్య కేంద్రం (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌), యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు.

దగ్గు, శ్వాసకోశ లక్షణాలు లేనివారిలో నోటిలో ఈ వైరస్‌ ఎలా వ్యాపిస్తుందనే విషయంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం కొవిడ్‌ పాజిటివ్‌ రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించారు. వీటిని ఆరోగ్యవంతులైన వారి నుంచి సేకరించిన నోటి నమూనాల్లోని కణాలతో పోల్చి చూశారు. వీటి ద్వారా నోటిలోని కణాలు కూడా సార్స్‌-కోవ్‌-2 బారినపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని గుర్తించారు. వీటిని నిర్ధారించుకునేందుకు చనిపోయిన కొవిడ్‌ రోగుల నమూనాలను సేకరించి విశ్లేషించారు. తద్వారా నోటి కణాలపై వైరస్‌ ప్రభావాన్ని స్పష్టంగా గమనించారు. అంతేకాకుండా వైరస్‌ అధికంగా ఉన్న లాలాజలాన్ని మింగినా, లేదా అటువంటి కణాలను పీల్చుకున్నా కూడా గొంతు, ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు వైరస్‌ వ్యాప్తించే అవకాశాలూ ఉన్నాయని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ కెవిన్‌ ఎం బెయార్డ్‌ వెల్లడించారు. అయితే, ఈ అధ్యయనం కొన్ని నమూనాలను పరిగణలోకి తీసుకొని చేసిందేనని.. వైరస్‌ వ్యాప్తికి నోటి కణాలు కారణమని నిర్ధారించుకునేందుకు విస్తృత పరిశోధన అవసరమని బెయార్డ్‌ అభిప్రాయపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని