Scrub Typhus: చిన్నారులకు కొత్త రకం వ్యాధి..  యూపీలో 8 మంది మృతి! - scrub typhus many kids diagnosed with new mystery fever in western up
close
Published : 02/09/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Scrub Typhus: చిన్నారులకు కొత్త రకం వ్యాధి..  యూపీలో 8 మంది మృతి!

మథుర: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో మరో కొత్త రకం వ్యాధి వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలుస్తోంది. దీన్ని స్ర్కబ్‌ టైఫస్‌ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. తాజాగా మథుర జిల్లా మెడికల్‌ ఆఫీసర్ డాక్టర్‌ రచన గుప్తా మాట్లాడుతూ.. ఒక్క కోహ్‌ గ్రామంలోనే 26 మంది స్ర్కబ్‌ టైఫస్‌ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. పిప్రోత్‌లో ముగ్గురు, రాల్‌లో 14, జసోడాలో 17 మందికి ఈ వ్యాధి సోకిందన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పది మంది మరణించగా.. ఇందులో 8 మంది చిన్నారులు ఉన్నట్లుగా నివేదికలు అందాయని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు పశ్చిమంగా ఉన్నా ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్ జిల్లాలో వ్యాధి సోకి మరణాలు కూడా సంభవించాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారని వెల్లడించారు.

ఎలా వ్యాపిస్తుందంటే..?

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. స్క్రబ్ టైఫస్‌ అనేది ఓరియెంటియా త్సుత్సుగముషి (orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. చిగ్గర్స్ (larval mites) అనే పురుగు కాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దీన్ని ‘ష్రబ్‌ టైఫస్’ అని కూడా పిలుస్తారు.

వ్యాధి లక్షణాలివి..

చిగ్గర్స్‌ కాటుకు గురైన వారిలో ముందు 10రోజుల వరకు విపరీతమైన జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, ఒళ్లంతా దద్దుర్లు పుట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఎటువంటి టీకాలు అందుబాటులో లేవని సీడీసీ తెలిపింది. వ్యాధి బారిన పడిన వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పింది. చిగ్గర్స్ ఎక్కువగా చెట్ల పొదలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తుంటాయని.. ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మంచిదని పేర్కొంది. అంతేకాకుండా చిన్నారుల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడాలని సూచించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని