Nagarjuna: జూన్‌ నుంచి రెండో షెడ్యూల్‌ - second schedule of king nagarjuna and praveen movie will start from june
close
Published : 16/05/2021 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nagarjuna: జూన్‌ నుంచి రెండో షెడ్యూల్‌

ఇంటర్నెట్ డెస్క్‌: నాగార్జున హీరోగా ప్రవీణ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఇంతలోనే కరోనా కేసులు పెరుగుతుండటంతో చిత్రీకరణ వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ కూడా మొదలు కానుంది. జూన్‌ మొదటి వారం నుంచి చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్‌ అగర్వాల్‌ సందడి చేయనుంది. ‘గరుడ వేగ’తో మంచి విజయం సాధించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రాన్ని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యమిచ్చే నాగార్జున ఈ సినిమాకు ఓకే చెప్పడానికి బలమైన కథే కారణమట. ఆయన నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని