కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం - second wave of covid-19 has stronger infection among children
close
Published : 10/04/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం

న్యూదిల్లీ: ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలోనూ పాజిటివ్‌ వచ్చిన చిన్నారులు చాలా అరుదు. అదే సమయంలో ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. తాజాగా చిన్నారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. వారిలో తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం పదేళ్లు అంతకు మించిన వారు మాత్రమే కాదు. ఏడాది నుంచి 8ఏళ్ల వయసు వారిలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘‘చిన్నారుల్లో తీవ్రమైన జ్వరం వస్తోంది. శరీర ఉష్ణోగ్రత 101-102 డిగ్రీలు నమోదవుతోంది. వెంటనే జ్వరం తగ్గడం లేదు. గతవారం కరోనా బారిన పడిన పదేళ్లు అంతకు మించి వయసు ఉన్న పిల్లలకు వైద్యం చేశాం’ అని దిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ ధీరేన్‌ గుప్త తెలిపారు. జ్వరంతో పాటు, ముక్కు దిబ్బడ, పొత్తి కడుపులో నొప్పి, విరోచనాల వంటి లక్షణాలతో చిన్నారులు బాధపడుతున్నారు. ‘గతంలో చిన్నారులు కరోనా బారిన పడినా ఎలాంటి లక్షణాలు ఉండేవి కావు. ప్రస్తుతం తల్లిదండ్రుల నుంచి చిన్నారులకు కరోనా వ్యాపిస్తోంది. గతేడాది పోలిస్తే, ఇలాంటి కేసుల సంఖ్య రెండింతలుగా ఉంది. గొంతనొప్పి, నీరసం, తలనొప్పి, అలసటతో ఎక్కువమంది చిన్నారులు బాధపడుతున్నారు’ అని మ్యాక్స్‌ ఆస్పత్రి చెందిన సీనియన్‌ డైరెక్టర్‌, పీడియాట్రిషన్‌ డాక్టర్‌ శ్యామ్‌ కుక్రేజా తెలిపారు.

ఈ నేపథ్యంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. భవిష్యత్‌లో చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని కుక్రేజా వ్యక్తం చేశారు. అందుకు మరో ఏడాది కాలం పట్టవచ్చని పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 30శాతం కన్నా ఎక్కువ కేసులు ఉత్పరివర్తనం చెందిన వైరస్‌ కారణంగా వస్తున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని