కొవిడ్ ఎఫెక్ట్‌.. బెంగళూరులో 144 సెక్షన్‌   - section 144 imposed in bengaluru
close
Updated : 07/04/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్ ఎఫెక్ట్‌.. బెంగళూరులో 144 సెక్షన్‌ 

బెంగళూరు: కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ఆంక్షలు అమలుచేస్తున్న ప్రభుత్వం.. వైరస్‌ కట్టడి కోసం మరిన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించింది. బెంగళూరు నగర పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈత కొలనులు, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 6150 కొత్త కేసులు రాగా.. వాటిలో ఒక్క బెంగళూరులోనే 4266 కేసులు ఉండటం అక్కడి ఉద్ధృతికి అద్దంపడుతుతోంది. అలాగే నిన్న 39మంది మరణించగా.. వారిలో 26 మరణాలు నగరంలోనే కావడం గమనార్హం. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 10.26లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,68,762మంది కోలుకోగా..  12,696 మంది కొవిడ్‌తో మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 45,107 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని