జ్వాలారెడ్డి.. బాలారెడ్డి.. ఆడించే కబడ్డీ..! - seetimaarr jwala reddy​ lyrical song
close
Published : 12/03/2021 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జ్వాలారెడ్డి.. బాలారెడ్డి.. ఆడించే కబడ్డీ..!

హైదరాబాద్‌: గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వంలో క్రీడా నేపథ్యంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా సంబంధించి ‘జ్వాలారెడ్డి’ లిరికల్‌ సాంగ్‌ని హీరో రామ్‌ విడుదల చేశారు. మణిశర్మ అందించిన స్వరాలకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. శంకర్‌బాబు, మంగ్లీ ఆలపించారు. ఆద్యంతం అలరించేలా పాట సాగింది.

ఇందులో గోపీచంద్‌, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. జ్వాలరెడ్డిగా తమన్నా తెలంగాణ జట్టు కోచ్‌గా కనిపించనుండగా, గోపీచంద్‌ ఆంధ్రా జట్టు కోచ్‌గా అలరించనున్నారు. దిగంగన సూర్యవంశీ మరో కథానాయిక. భూమిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఏప్రిల్‌ 2, 2021న ‘సీటీమార్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని