జైసల్మేర్‌లో ‘సీటీమార్‌’ - seetimar shoot update
close
Published : 09/02/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జైసల్మేర్‌లో ‘సీటీమార్‌’

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: గోపీచంద్‌- సంపత్‌ నంది కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా, దిగంగన సూర్యవంశీ నాయికలు. తుది దశ చిత్రీకరణలో ఉందీ చిత్రం. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ఏడారి ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకొంటుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు దర్శకుడు సంపత్‌. అక్కడ షూట్‌ చేసిన ఓ యాక్షన్‌ సీన్‌కి సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఓ బైక్‌ వేగంగా దూసుకెళ్తూ దర్శనమిస్తుంది. హీరో గోపీచంద్‌ అస్పష్టంగా కనిపిస్తుంటారు. మరికొన్ని కీలక సన్నివేశాలు, పాటలు అక్కడ చిత్రీకరించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. గోపీచంద్‌, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారీ చిత్రంలో. భూమికా చావ్లా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా.

ఇదీ చదవండి..

నా నటన చూసి ఏడ్చేశారు: కృతి శెట్టి

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని