భవిష్యత్తులో కోమలితో పాడిస్తా - sekhar kammula on sarangadariya issue
close
Published : 18/03/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భవిష్యత్తులో కోమలితో పాడిస్తా

హైదరాబాద్‌: నా సినిమాలో జానపద గీతానికి చోటుంటే భవిష్యత్తులో తప్పకుండా కోమలికి పాడే అవకాశం ఇస్తానన్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో, నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఇందులోని సారంగ దరియా... పాటపై వివాదం నెలకొంది. ఆ పాటని వెలుగులోకి తీసుకొచ్చిన జానపద గాయని కోమలితో కాకుండా మరో గాయనితో పాడించడంపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల, గాయని కోమలి భేటీ అయ్యారు. అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘ఇన్ని రోజులు సమాచార సమస్య వల్ల కోమలిని కలవలేకపోయా. ఈరోజు మాట్లాడుకున్నాం. నేనిచ్చిన హామీలకిగానూ ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంతటితో వివాదం ముగిసిందని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్నాళ్లూ ఉండేది. కానీ రాబోయే సినిమాల్లో నాతో పాడిస్తానని శేఖర్‌ కమ్ముల హామీ ఇచ్చారు. ‘లవ్‌స్టోరి’ పాటల విడుదల వేడుకలో నాతో సారంగ దరియా పాట పాడిస్తానని చెప్పారు. ఇకపై ఈ పాట విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు’’ అన్నారు కోమలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని