డ్యాన్సర్లు.. నాకు ఫోన్‌ చేయండి: శేఖర్‌ మాస్టర్‌ - sekhar master providing groceries to dancers
close
Published : 15/05/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్యాన్సర్లు.. నాకు ఫోన్‌ చేయండి: శేఖర్‌ మాస్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ వేళ పొట్టకూటి కోసం చాలామంది తిప్పలు పడుతున్నారు. మనకు రోడ్లపై కనిపించేవారే కాకుండా మరెంతో మంది భోజనానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్యాన్స్‌నే నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చిన డ్యాన్సర్లదీ అదే పరిస్థితి. వారంతా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు లేక టీవీ షోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా.. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ప్రముఖ కొరియోగ్రఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ అండగా నిలబడ్డారు. నిత్యావసర సరకుల కోసం తనను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక వీడియో పంచుకున్నారు.

ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని.. గ్రూప్‌ డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు పని దొరకడం కష్టంగా మారిందన్నారు. ఏదైనా కార్యక్రమాలు, టీవీ షోలు జరిగితే తప్ప వాళ్లకు పని ఉండదని ఆయన చెప్పారు. భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్లు చాలామంది ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారు ఎవరున్నా తనను సంప్రదించాలని సూచించారు. వారికి తమ టీమ్‌ కావాల్సిన సరకులు అందిస్తుందని ఆయన అన్నారు. ఇందుకోసం ఆయన కొన్ని ఫోన్‌ నెంబర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని