అప్పుడు వేణు మాధవ్‌.. ఇప్పుడు ఎస్పీ బాలు - september 25 last year venu madhav now spb passed away same date
close
Published : 26/09/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు వేణు మాధవ్‌.. ఇప్పుడు ఎస్పీ బాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సుమధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త యావత్‌ సంగీత ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది. మరీ ముఖ్యంగా బాలు అభిమానులు, శ్రేయోభిలాషులకు తీరని వేదన మిగిల్చింది. కరోనాను జయించిన ఆయన ఇతర అనారోగ్య సమస్యలతో శుక్రవారం(సెప్టెంబరు 25న) కన్నుమూశారు. సరిగ్గా ఏడాది కిందట ఇదే సెప్టెంబరు 25న కూడా తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

వెండితెరపై తనదైన నటన, హావభావాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు వేణుమాధవ్‌. ఆయన కూడా గతేడాది ఇదే రోజున కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు బాలు కూడా ఇదే తేదీన దూరం కావడం యాదృచ్ఛికం.

తాజాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. ‘వేణు మాధవ్‌ మృతి చెందారన్న విషయాన్ని మర్చిపోక ముందే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారిని ఇదే రోజున మనం కోల్పోడం నిజంగా విచారకరం’ అని నటుడు నాగబాబు పేర్కొన్నారు. ఇద్దరూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారని, వారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని