మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురి మృతి! - seven people died in maharashtra yavatmal due to consuming hand sanitizer when they couldnt get alcohol
close
Updated : 25/04/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురి మృతి!

ముంబయి: మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మల్‌ జిల్లాలోని వాణి ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మద్యానికి బానిసయ్యారు. ప్రస్తుతం మద్యం దొరక్కపోవడంతో సదరు వ్యక్తులు హ్యాండ్‌ శానిటైజర్‌ను తాగారు. దీంతో ఆ ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా కూలీలుగా పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని