87శాతం కరోనా కేసులు ఆ ఏడు రాష్ట్రాల్లోనే! - seven states account for 87.73 percent of the new cases reported in a day
close
Updated : 14/03/2021 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

87శాతం కరోనా కేసులు ఆ ఏడు రాష్ట్రాల్లోనే!

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా ఒక పక్క కరోనా వ్యాక్సిన్‌ పక్రియ కొనసాగుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిత్యం కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ్యవాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 87.73శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే నుంచి వస్తున్నాయని ఆదివారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

* మహారాష్ట్రలో అత్యధికంగా 15,602 కొత్త కేసులు నమోదు కాగా, కేరళలో 2,035, పంజాబ్‌లో 1,510మంది కరోనా బారినపడ్డారు.

* దేశవ్యాప్తంగా 161మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో 88, పంజాబ్‌లో 22, కేరళలో 12మంది చనిపోయారు.

* ప్రస్తుతం భారత్‌లో 2.10లక్షల కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 76.93శాతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లో నమోదవుతున్నాయి.

* కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 7,467మంది కోలుకున్నారు.

* 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.

* కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 3కోట్లకు చేరువైంది. ఇప్పటివరకూ 2.97కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు ఇవ్వగా, ఇందులో 73లక్షల మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు, 11లక్షలమంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఫస్ట్‌ డోస్‌ ఇచ్చారు. ఇక 42లక్షల మంది హెల్త్‌కేర్‌, 73లక్షల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సెకండ్‌ డోస్‌ అందుకున్నారు.

* 45 సంవత్సరాలు దాటి, తీవ్ర వ్యాధులతో పోరాడుతున్న 14లక్షలమంది, సీనియర్‌ సిటిజన్లు 81లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని