ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకునే వ్యక్తి నచ్చితే సరిపోదు అతని ఇంటి పేరు కూడా బాగుండాలని అంటోది నాయిక దృశ్య రఘునాథ్. సాగర్ ఆర్.కె. నాయుడు, దృశ్య జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షాదీ ముబారక్’. పద్మశ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. ‘ఇప్పటి వరకు మీ ఇంటి పేరుతో బతికా.. తర్వాత చేసుకునే వాడి ఇంటి పేరుతో బతకాలి కదా అందుకే నాకు అతని ఇంటి పేరు కూడా నచ్చాలి’ అని హీరోయిన్ చెప్పే ఈ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది టీజర్.
పెళ్లి నేపథ్యంలో తెలుగు తెరపై ఇప్పటి వరకు రాని కొత్త కథ అనిపిస్తుంది ఈ ఒక్క డైలాగ్ వినగానే. ‘మీ ఇంటి పేరేంటండీ?’ అని హీరో అడిగితే ‘టెంపరరీగా మా పేరెంట్స్ ఇంటి పేరునే వాడుకుంటున్నా’ అంటూ హీరోయిన్ సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశంలోనూ నాయకానాయికల నటన అలరిస్తోంది.
ఇలా ఇంటి పేరు పోరుతో ఆద్యంతం సందడిగా సాగుతుంది టీజర్. ఈ షాదీ కహానీ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నరోజ్. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’