Bollywood: కారు, నగలు అమ్మేసిన నటి - shagufta ali reveals she reached out to sonu sood for financial help
close
Published : 08/07/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: కారు, నగలు అమ్మేసిన నటి

సాయం కోసం సోనూని కలిశా

ముంబయి: ‘పునర్వివాహ్‌’, ‘సంజీవని’, ‘జారా’ వంటి హిందీ సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన నటి షగుప్తా అలీ. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబపోషణ, ఇతర వైద్య చికిత్సల కోసం ఇప్పటికే ఆమె తన బంగారు ఆభరణాలను అమ్మేశారు. అవకాశాలు లేకపోవడం వల్ల ఆదాయం లేదని.. దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపారు. ఈమేరకు సాయం కోరుతూ ఇటీవల ఆమె నటుడు సోనూసూద్‌ని కలిసినట్లు పేర్కొన్నారు.

‘సుమారు 30 ఏళ్లపాటు ఎన్నో సీరియల్స్‌, సినిమాల్లో నటించాను. కొంతకాలం క్రితం నేను రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తీసుకున్నాను. దానివల్ల అప్పటివరకూ దాచుకున్న సొమ్ము మొత్తం నా వైద్యానికే ఖర్చు చేశాను. ఈ క్రమంలోనే నాకు ఆఫర్స్ తగ్గాయి. అయినప్పటికీ ఆర్థికంగా రాణించాలనే ఉద్దేశంతో అవకాశాల కోసం ఎదురుచూశాను. అదే సమయంలో డయాబెటిస్‌, ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సరైన ఆదాయం లేకపోవడంతో ఇంట్లో ఉన్న నా బంగారు ఆభరణాలను విక్రయించి చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవలే కారు కూడా అమ్మేశాను. నా గురించి తెలుసుకున్న సహ నటులు కొందరు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే నేను.. ఆర్థిక సాయం కోరుతూ నటుడు సోనూసూద్‌ని కలిశాను. కానీ, సోనూ.. ఆర్థిక సాయం చేయడం లేదని తెలిపారు’ నటి షగుప్తా వివరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని