టైమ్‌కి వస్తా.. ఆలియాకు మాటిచ్చిన షారుఖ్‌ - shah rukh khans asks alia bhatt to sign him in her next production
close
Published : 05/07/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైమ్‌కి వస్తా.. ఆలియాకు మాటిచ్చిన షారుఖ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఒక్క ఛాన్స్‌ అనే పదం సినిమా ఇండస్ట్రీలో ప్రవేశం కోసం ఎదురుచూసే వాళ్ల నోటి నుంచి వింటూ ఉంటాం. కానీ.. బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ నుంచి వస్తే.. అదీ ఇటీవల నిర్మాత అవతారం ఎత్తిన ఒక హీరోయిన్‌ను అడిగితే ఎలా ఉంటుంది..? బాలీవుడ్‌ యువనటి అలియా భట్‌ ఇటీవల నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ‘డార్లింగ్స్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా.. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందని ప్రకటిస్తూ తన ఆనందాన్ని ట్విటర్‌లో పంచుకుంది. అదే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న షారుఖ్‌ఖాన్‌ ఆ ట్వీట్‌పై స్పందించాడు. అది కాస్తా ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ షారుఖ్‌ ఏం ట్వీట్‌ చేశాడంటే..

‘‘ఈ ప్రాజెక్టు పూర్తవగానే.. మీ సొంత నిర్మాణ సారథ్యంలో నాకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రమాణం చేసి చెబుతున్నా షూటింగ్‌కు సమయానికి వస్తా. హుందాగా వ్యవహరిస్తా’’ అని షారుఖ్‌ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇక ‘డార్లింగ్‌’ విషయానికి వస్తే.. ఈ సమాజంలో తమ ప్రాధాన్యతను తెలుసుకోవాలని అనుకునే తల్లి, కుతూళ్ల కథతో, ముంబయిలోని దిగువ మధ్య తరగతి కుటుంబాల నేపథ్యంలో తెరకెక్కించారు. జాస్మిత్‌ కె.రీన్‌ దర్శకత్వం వహించనున్నారు. విశాల్‌ భరద్వాజ్‌ సంగీతం అందించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని