వారసత్వ రాజకీయాలే ఆ పార్టీల లక్ష్యం: షా - shah tears into dmk for a rajas offensive remarks against tn cm
close
Published : 02/04/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారసత్వ రాజకీయాలే ఆ పార్టీల లక్ష్యం: షా

చెన్నై: డీఎంకే పార్టీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ఇటీవల డీఎంకే నేత రాజా సీఎం పళనిస్వామి తల్లిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను షా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన గురువారం తిరుకోయిలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 6న జరగబోయే ఎన్నికల్లో మహిళలంతా డీఎంకే పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

‘కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు అవినీతి, వారసత్వ రాజకీయాలు చేస్తాయి. ఒక దివంగత మహిళపై డీఎంకే నేత రాజా చేసిన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలోనూ డీఎంకే నేతలు దివంగత మాజీ సీఎం జయలలితపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పార్టీకి మహిళలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎన్నికల సమరం అభివృద్ధి పథంలో నడిచే ఎన్డీయేకు.. అవినీతి, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే యూపీఏకు మధ్య జరుగుతోంది’ అని షా మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఓ వైపు కాంగ్రెస్‌ నాయకురాలు సోనియగాంధీ తన కుమారుడు రాహుల్‌కు అధికారం అందించే బెంగతో ఉండగా.. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్‌ తన కుమారుడు ఉదయనిధి మీద బెంగతో ఉన్నారని విమర్శించారు.  తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని