ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది? - shahid afridi once again makes confusion about his age
close
Published : 02/03/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి తన వయసుపై గందరగోళం సృష్టించాడు. తనకిప్పుడు 44 ఏళ్లని అంటున్నాడు. తాను 1975లో జన్మించానని గతంలో ఒకసారి చెప్పాడు. ఆ లెక్కన చూస్తే అతనికిప్పుడు 46 ఏళ్లు అవ్వాలి. ఐసీసీ రికార్డుల ప్రకారమైతే ఇప్పటికీ అతడి వయసు 41. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్‌ అందరినీ తికమక పెట్టింది.

‘జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు 44వ వసంతంలోకి అడుగుపెట్టాను! నా కుటుంబం, నా అభిమానులు నాకు అత్యంత ముఖ్యం. ముల్తాన్‌ జట్టుకు ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. ముల్తాన్‌ సుల్తాన్‌ అభిమానుల కోసం మ్యాచులను గెలిపించే ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని అఫ్రిది సోమవారం ట్వీటాడు.

నిజానికి అఫ్రిది జన్మదినంపై అందరికీ అనుమానాలు ఉన్నాయి. అతడు చెప్పేది వాస్తవమో కాదో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఒక్కోలా చెబుతుంటాడు. ఆ మధ్య గౌతమ్‌ గంభీర్‌ సైతం అతడి వయసుపై విమర్శలు గుప్పించాడు. ఐసీసీ రికార్డుల్లో అఫ్రిది జన్మదినం 1980, మార్చి 1గా ఉంటుంది. అంటే అతడి వయసు ఇప్పుడు 41గా ఉండాలి. తన స్వీయ చరిత్రలోనేమో 1975లో పుట్టానని చెప్పాడు. 1996లో 37 బంతుల్లో శతకం చేసినప్పుడు తనకు 19 ఏళ్లని చెప్పాడు. కానీ ఐసీసీ ప్రకారం 16 ఏళ్ల 217 రోజులు. అందుకే అతడి ట్వీట్‌ తికమక పెట్టింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని