సచిన్ త్వరగా కోలుకోవాలి: అఫ్రిది - shahid afridi wishes sachin tendulkar speedy recovery from covid-19
close
Published : 04/04/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్ త్వరగా కోలుకోవాలి: అఫ్రిది

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ కొవిడ్‌-19 నుంచి వేగంగా కోలుకోవాలని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది ఆకాంక్షించాడు. ‘‘సచిన్‌ కొవిడ్ నుంచి వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మీరు తొందరగా కోలుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో తక్కువ కాలంలోనే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నా’’ అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు. అఫ్రిది కూడా గత జూన్‌లో కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

తనకు కరోనా సోకినట్లు సచిన్‌ స్వయంగా మార్చి 27న ట్వీట్‌ చేశారు. వైద్యుల సలహా మేరకు ఈ నెల 2న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సచిన్‌కు కొవిడ్‌ సోకిందని తెలిసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ‘క్రికెట్‌ లెజెండ్‌’ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

‘‘తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు, వారు చూపిస్తున్న  ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు. వైద్యుల సలహా మేరకు తగిన  జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రిలో చేరా. కొద్దిరోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వస్తా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలి’’ అని సచిన్ రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేశారు.

ఇటీవల ముగిసిన ‘వరల్డ్‌ రోడ్ సేప్టీ సిరీస్‌’లో ఇండియా లెజెండ్స్‌ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టులోని నలుగురు సభ్యులు.. సచిన్‌, సుబ్రమణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌కు కొవిడ్‌ వైరస్‌ సోకింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని