‘జెర్సీ’ విడుదల తేదీ చెప్పేశారు - shahid kapoor jersey to release on diwali
close
Published : 18/01/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జెర్సీ’ విడుదల తేదీ చెప్పేశారు

ముంబయి: ఈమధ్య క్రీడా నేపథ్యంలో వచ్చిన బయోపిక్‌లు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో వచ్చి ప్రశంసలు అందుకున్న ‘జెర్సీ’ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో నేచురల్‌ స్టార్‌ నాని క్రికెటర్‌గా కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. అందులో షాహిద్‌కపూర్‌ క్రికెటర్‌గా నటించాడు. ఈ సినిమా కోసం బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. చిత్రబృందం శుభవార్త చెప్పింది. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి కానుకగా నవంబర్‌ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు షాహిద్‌కపూర్‌ సినిమాలోని తన లుక్‌ను రివీల్‌ చేస్తూ ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

గత ఏడాది ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా షాహిద్‌కపూర్‌కు గాయమైన విషయం తెలిసిందే. దాని నుంచి కోలుకొని షాహిద్‌ వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నాడు. గతంలో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు హిందీలో రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌సింగ్‌’లోనూ షాహిద్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు తెలుగు దర్శకులు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. మృణాల్‌ఠాకూర్‌, పంకజ్‌కపూర్‌, తుషార్‌కపూర్‌, శరద్‌కేల్కర్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌, సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌, దిల్‌రాజు, అమన్‌గిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
ఇదీ చదవండి..

రౌడీ రాకకు రంగం సిద్ధం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని